1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Maniratnam

K. Raghvendra Rao | Maniratnam | Villon | Nagarjuna | Annamayya | నాగార్జునతో అన్నమయ్యా..? హ..హ్హ...హ్హ అన్నారు...

కెరాఘవేంద్రరావు
WD
రాఘవేంద్రరావుకు కోపమొచ్చింది. అవును... షూటింగ్‌లో మెగా ఫోన్‌లోనే మాట్లాడే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఈ మధ్య కోపమొచ్చింది. ఏ సభలోనూ మాట్లాడరు. మౌన మునీంద్రుల్లాగా వ్యవహరిస్తారు. లేటెస్ట్‌గా ఆయన "ఝుమ్మంది నాదం" సినిమా తీశారు. అది త్వరలో విడుదల కానుంది.

అయితే ఇటీవలే ఓ ప్రముఖ పత్రిక, మణిరత్నం విలన్ సినిమా తీసి ప్రేక్షకుల్లో విలన్ అయ్యాడంటూ.. అసలు ట్రాక్ తప్పి.. అభిమానులను నిరుత్సాహ పరిచాడంటూ కథనం ప్రచురించింది. దానికితోడు విశ్వనాథ్ "గ్యాంగ్ లీడర్" తీస్తే ఎలాగుంటుంది...? రాఘవేంద్రరావుతో ఆనంద్ తీయిస్తే ఎలాగుంటుంది..? అంటూ కంపారిజన్ చేసింది. దీంతో ఆయన మనస్సు గాయపడింది.

ఈ విషయమై ఓ సభలో మాట్లాడుతున్న ఆయన సదరు పత్రికకు సంబంధించిన విలేకరిని పిలిచి మరీ మందలించాడు. నా గురించి రాశారు సరే... విశ్వనాథ్ అంతటివారితో కంపారిజన్ ఏమిటి...? ఆయనను చులకనగా చేసి మాట్లాడటమే గదా.. ఏం తెలుసని మీరు అలా రాశారు.

మణిరత్నం చాలా సినిమాలు చేశారు. ఒక్కోసారి ట్రెండ్ స్వీకరించకపోవచ్చు. అలాగైతే ఇదే పేపర్లో.. అమ్మోరు సినిమాకు రమ్యకృష్ణ చేయడమేమిటి..? అన్నారు. మరొకరు నాగార్జునతో అన్నమయ్యా... హ..హ్హ.. హ్హ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏమయ్యాయి...? వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టలేదా...?

దర్శకుడికి ఏమి చేయాలో... ఏమి చేయకూడదో తెలుసు. ఒక్కోసారి చేసింది నచ్చకపోవచ్చు. దానికి తాటాకులు కట్టి లేనిపోనివి చొప్పించడం భావ్యం కాదని సున్నితంగా మందలించారు. దీంతో ఆ విలేకరి ఖంగుతిని... ఇది తాము రాయలేదనీ, ఫ్రీలాన్సర్స్ రాశారని చెప్పగానే... ప్రముఖ పేపర్‌లో ఫ్రీలాన్సర్లు కూడా రాస్తారా...? అంటూ మళ్లీ అడిగారు. దీంతో అతను... నీళ్లు నమిలాడు. అక్కడ ఉన్నవారంతా ఆ వార్తను అలా రాసి ఉండకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం...
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి