Allu Aravind | Chinni Krishna | Cinema | Director | చిన్ని కృష్ణను డైరెక్టర్‌ని చేస్తా: అల్లు అరవింద్
WD
ఆ చిత్ర కథను చిరంజీవిగారు మూడుగంటలపాటు విని... వెంటనే అశ్వనీదత్‌తో ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. అసలు చిరంజీవిగారు కథలు అంతసేపు వినడమే గొప్ప... అలా చిన్నికృష్ణ మెప్పించాడు. అందుకే ఆయనలో దర్శకుడు ఉన్నాడు. ప్రస్తుతం బన్నీతో మరో హిట్ ఇవ్వాలని బద్రినాథ్‌కు మంచి కథ ఇచ్చాడు" అన్నారు
అనంతరం చిన్నికృష్ణ స్పందిస్తూ... "అల్లు అరవింద్ అంటే నా ప్రాణం. నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. బాలకృష్ణకు కథ చెప్పడానికి పెద్ద పెద్ద రచయితలను స్టార్ హోటళ్లలో పెట్టి బి. గోపాల్‌గారు సాన పట్టించారు. ఒక్కొక్కరికి ఒక్కో టైం కేటాయించారు.
నాకు రెండు నిమిషాలే టైమ్ వచ్చింది. ఆ రెండు నిమిషాల్లోనే... ఒక అబ్బాయి డాన్స్ స్కూల్ పెడతాడు. అక్కడ హీరోయిన్ నేర్చుకుంటుంది. ఆమె ఇతడిని ప్రేమించడం. ఈ విషయం తెలిసి విలన్లు వస్తారు. ఇదీ నేను చెప్పింది. వెంటనే బి.గోపాల్ ఓకే అనడం.. అది నరసింహనాయుడుగా రూపొందడం జరిగింది. అలాగే ఇంద్ర సినిమాక్కూడా చిరంజీవిగారు ఓపిగ్గా కథను మూడు గంటలపాటు విని అభినందించారు" అని చెప్పారు.