Saradaaga Kasepu | Naresh | Vamsi | "సరదాగా కాసేపు" సెట్లో నరేష్ పుట్టినరోజు
WD
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. నా చిన్నతనం నుంచి వంశీ చిత్రాలంటే ఇష్టం. మద్రాసులో మా పక్కనే ఉండేవారు. అంకుల్ అని పిలిచేవాడిని. ఇప్పుడు కూడా దర్శకుడిగా కాకుండా అంకుల్ అంటాను. ఆయన దర్శకత్వంలో చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
నిర్మాత ఎం.ఎల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. డాన్ సినిమా తర్వాత రెండేళ్ల తర్వాత గ్యాప్ వచ్చింది. ఒకరోజు వంశీగారు వచ్చి మీకు సినిమా చేసి పెడతానన్నారు. వెంటనే అంగీకరించాను. గోదావరి అందాలను వంశీ బాగా తీయగలరు.
ఫ్యామిలీలో ఉండే సంబంధాలు సరదాగా నవ్వుకునేటట్లుగా ఈ చిత్రం ఉంటుంది. చక్రి 5 పాటలకు సంగీతం సమకూర్చారు. ఇందులో వంశీ పాటలు పాడటం విశేషం అని చెప్పారు. మధురిమ హీరోయిన్‌గా నటిస్తోంది.