Hyderabad short film festival | Jubli hills | జూలై 4,5 తేదీలలో హైదరాబాద్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్
హైదరాబాద్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఈ నెల 3,4 తేదీలలో జూబ్లిహిల్స్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగనుంది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీమతి గీతారెడ్డి చేతుల మీదుగా ఈ వేడుక ఆరంభం కానుంది. దేశ విదేశాల నుంచి 285 చిత్రాలు ఎంట్రీకి రాగా.. అందులో ఫైనల్‌గా 50 చిత్రాలను ఎంపిక చేశారు.
3,4న ఈ చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. ఈ వేడుకకు ఎంవీయస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దివాకర్ బాబు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, శ్రీచైతన్య చీఫ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ ఫిక్షన్, ఉత్తమ యానిమేషన్, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ కాన్సెప్ట్, ఉత్తమ ఫోటోగ్రఫీ, ఉత్తమ ఎడిటర్, జ్యూరీ అవార్డ్... ఈ ఎనిమిది విభాగాలకు బహుమతి ప్రదానం చేయనున్నారు.
ఈ అవార్డ్ కమిటీకి ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు ఎమ్.వి. రఘు అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా... ప్రియదర్శిని రామ్, ఎమ్ బీఎస్ ప్రసాద్, సాంబశివరావు, కార్టూనిస్ట్ మల్లిక్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. విజేతలకు అందించే నగదు బహుమతి కోసం సాక్షి దినపత్రిక యాజమాన్యం లక్షా యాభైవేల రూపాయలు విరాళంగా అందజేశారు. 4వ తేదీ సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో డాక్టర్ దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని, విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.