1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Allari Naresh

Kathi kantarao | Allari Naresh | కత్తి పట్టని కత్తి కాంతారావు

కత్తి కాంతారావు
అల్లరి నరేష్ కత్తి పట్టకుండా కత్తి కాంతారావు తరహాలో దొంగలపై పోరాడుతుంటాడు. తన ఇంటిపేరు కత్తి. తన పేరు కాంతారావు. కనుక దొంగల గుండెల్లో కత్తి కాంతారావుగా నిద్రపోతాను అంటాడు. రాజమౌళి సినిమాల్లాగా కత్తులు పట్టి బీభత్సాలు చేయను అని నరేష్ అన్నారు.

గతంలో బురిడి సినిమాను తీసిన బిగ్ బి ప్రొడక్షన్స్ నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నారు. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకుడు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ఆరంభమైంది. మాగంటి బాబు స్విచాన్ చేయగా, రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఇ.వి.వి మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో పాత్ర చాలా తెలివిగా ఉంటుంది. అతను చేసేది కానిస్టేబుల్ పని అయినా ఎస్ఐతో సహా అందర్నీ గడగడలాడిస్తాడు. అతని కుటుంబ సమస్యలుంటాయి. నలుగురు చెల్లెళ్లు ఉంటారు. ఉద్యోగం చేస్తూ వారిని ఎలా పరిష్కరించాడు అన్నది కథ.

తన దర్శకత్వంలో గతంలో అప్పుల అప్పారావు వచ్చిందని అన్నారు. ఆ చిత్రం తరహాలోనే ఇది కూడా ఉంటుందన్నారు. కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి