Pavan Kalyan | Jesus Christ | Aditya Productions | ఏసుక్రీస్తు జీవిత చరిత్ర నేపధ్యం చిత్రంలో పవన్ కల్యాణ్
WD
ఏసు ప్రభువు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత కొండా కృష్ణంరాజు ఆదివారం విలేకరులకు తెలియజేస్తూ... ఇజ్రాయెల్‌లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ చేయనున్నాం.
ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటారు. 19వ తేదీన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన జెరూసలేంలోగల చారిత్రాత్మకమైనటువంటి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ కొండపై అంతర్జాతీయ మీడియాతో సమావేశమవుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ అక్కడ తెలియజేస్తాం.
ఈ సమావేశం తాలూకు ప్రత్యక్ష ప్రసారాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశంలోని ముంబయి, హైదరాబాదు, కొచ్చిన్ నగరాలలోని మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్‌ను ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఇటలీలలో చేస్తాం అన్నారు. తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషలలో రూపొందే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రచన: జె.కె.భారవి, ఫోటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్