Varun Sandesh | Nisha Agarwal | వరుణ్ సందేశ్ - నిషా అగర్వాల్ చిత్రం షూటింగ్...
హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వంటి సూపర్ హిట్ చిత్రాల కథానాయకుడు వరుణ్ సందేశ్ హీరోగా, అధినేత వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత కేసన్నపల్లి రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై అరిమిల్లి రామకృష్ణ సమర్పణలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం షూటింగ్ హైదరాబాదులో రెండు వారాలుగా జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత కేసన్నపల్లి రాధామోహన్ మాట్లాడుతూ... రెండు వారాలుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులోని పలు లొకేషన్స్‌లో జరుగుతోంది. మియాపూర్‌లో వేసిన సెట్‌లో, పంజాగుట్టలో పెంట్ హౌస్ సెట్‌లో డెక్కన్ పార్క్, నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఎక్కడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా ఈ తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది అన్నారు.
వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్, శశాంక్, నిషా షా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: చక్రి, ఫోటోగ్రఫీ: బుజ్జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎంఎస్ కుమార్, నిర్మాత: కేసన్నపల్లి రాధామోహన్, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ నంది