Lokame kottaga | Aditi Agarwal | Bharat | "లోకమే కొత్తగా" కోసం మైసూరు వెళ్తోన్న అదితి
అదితి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "లోకమే కొత్తగా". భరత్ పారేపల్లి దర్శకుడు. రమేష్ బాధావత్, శోభన్ బాబు అక్కినపల్లి, పురుషోత్తమ కొమ్ము నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్‌లో మూడు పాటలను పూర్తి చేసుకుని వచ్చింది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాదులో కొంత టాకీ షూటింగ్ జరుగుతోంది. మూడు రోజుల అనంతంరం మైసూర్ వెళ్లి అక్కడ రెండు పాటలు, సీన్స్ తీస్తామన్నారు. హీరో శివాజీ మాట్లాడుతూ.. ఇది కన్నడంలో 150 రోజులు ప్రదర్శించబడిన "మొగ్గల మనస్సు" సినిమా రీమేక్. తెలుగులోకూడా అంతటి హిట్ అవుతుందనే నమ్మకముందని అన్నారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ... ఆర్తి అగర్వాల్ "నీలవేణి" చేస్తున్నప్పుడు అదిత అగర్వాల్ పరిచయం ఏర్పడింది. ఆమె అమెరికాలో ఉన్నా... ఈ పాత్ర ఆమెతోనే వేయించాలని తీసుక వచ్చాం. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. యువతకు, పెద్దలకు నచ్చే చక్కటి ప్రేమకుటుంబ కథా చిత్రం ఇది. ఆగస్టు నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.
