Saikumar | Aditya | వైభవంగా సాయికుమార్ తనయుడు ఆదిత్య తెరంగేట్రం
WD
మాక్స్ ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. బ్యానర్‌ను డి.రామానాయుడు, టైటిల్‌ను హీరో శ్రీహరి విడుదల చేశారు. ఆదిపై ఒపెన్ షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కెమారా స్విచాన్ చేశారు. నాగార్జున దర్శకత్వం వహించారు. ఆది డాన్స్ చేస్తూ స్టేజిపైకి వచ్చారు.
చిరంజీవి మాట్లాడుతు... ఆది తండ్రిని మించిన తనయిడు కావాలని ఆశీర్వదించారు. అక్కినేని మాట్లాడుతూ... సాయికుమార్ అంటే ఈర్ష్యపడేవాడిని.. ఆయన వాయిస్ అలా ఉండేది. నా 66 ఏళ్ల కెరీర్‌లో 120 మంది కొత్త హీరోలను చూశాను. టైటిల్ చాలా బాగుంది. ప్రేమ అందరికి కావలి. ఇండస్ట్రీ ప్రేమ ఆదికి ఉంటుందని అన్నారు.
జయసుధ మాట్లాడుతూ... ఆది మంచి క్రికెటర్ అవుతాడని అనుకున్నాను. కాని హీరో అవ్వాలని ఈ రంగంలొకి వచ్చాడు. ఆల్ ది బెస్ట్ అన్నారు. ఈ సినిమాకు విజయ్ భాస్కర్ దర్శకుడు. త్వరలొ షూటింగ్ ప్రారంభం కానుంది.