1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Balaji Movies

Priyamani | Balaji Movies | లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్న ప్రియమణి

ప్రియమణి
గ్లామర్, పెర్‌ఫార్మెన్స్ ఇలా రెండు రకాలైన పాత్రలు చేస్తూ అగ్రకథానాయికల్లో ఒకరిగా భాసిల్లుతున్న జాతీయ ఉత్తమ నటి ప్రియమణి త్వరలో తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తున్నారు. 

ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ బాలాజీ మూవీస్ పతాకంపై వైఎస్ ప్రతాప్ రెడ్డి సమర్పణలో జి. గోవిందరాజు నిర్మించనున్నారు.

పలు చిత్రాల్లో నటుడిగా చేసి, ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన తోట వేణుగోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత గోవింద రాజు మాట్లాడుతూ... నవ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న చిత్రమిది. తొలిసారిగా ప్రియమణి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది.

అక్టోబరులో లాంఛనంగా షూటింగ్‌ను ప్రారంభించి నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు.
About Writer
Venkateswara Rao. I