Brindavanam | Samshabad | Songs | Jr NTR | Kajal Agarwal | "బృందావనం" గోవిందుడు అందరి వాడేలే...
WD
శనివారంతో పాట పూర్తవుతుంది. చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... రేపటితో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్టులో చివరి షెడ్యూల్ చేస్తాం. అదే నెలలో ఆడియోను విడుదల చేస్తాం. సెప్టెంబరులో సినిమాను రిలీజ్ చేస్తాం అన్నారు.
ఎన్టీఆర్‌కు బృందావనం అనే టైటిల్ పెట్టడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీటర్ హేన్స్, రామ్ లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో చేశాం. మా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వాల్యూను ఈ చిత్రం పెంచుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు వంశీ మాట్లాడుతూ... రెండవ సినిమానే ఎన్టీఆర్‌తో చేయడం ఆనందంగా ఉంది. ఈ రోజు తీసే పాట ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాట. ఇందులో తారాగణమంతా పాల్గొన్నారు. దిల్ రాజు నిర్మాణానికి చాలా ఫ్రీడమ్ ఇచ్చి తోడ్పడ్డారు. ఆగస్టులో జరిగే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ఇది ఛాలెంజింగ్ మూవీ. దిల్ రాజు మంచి సపోర్ట్ ఇచ్చారు. నా కెరీర్ లోనే పెద్ద చిత్రమవుతుంది. పెద్ద స్టార్స్ ఉన్న సినిమాకు సంగీతం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
ఇంకా నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గీత రచయిత అనంత శ్రీరామ్, ఛోటాకెనాయుడు మాట్లాడుతూ.. ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావాలని ఆకాంక్షించారు.