1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ileana

NTR | Ileana | Sakthi movie | Meher Ramesh | Aswani Datt | Kantri | Ladak | లడక్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!

ఎన్టీఆర్
WD
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కంత్రి' ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం "శక్తి". ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ.."ఈజిప్టులో జరిగిన షెడ్యూల్‌లో విలన్స్‌కు సంబంధించిన కొన్ని కీలమైన సన్నివేశాల్ని జాకీష్రాఫ్, పూజాబేడి, సోనూ సూద్‌లతో పాటు 25 మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరిగింది. జూలై 11 నుంచి సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, జమ్మూకాశ్మీర్, రుషికేష్, హరిద్వార్‌లలో అత్యంత కీలమైన సన్నివేశాల్ని చిత్రీకరించనున్నాం.

తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక లొకేషన్స్‌లో, భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ లాండ్‌మార్క్ ఫిలిమ్ అవుతుంది. మా వైజయంతీ మూవీస్ బేనర్‌కి "శక్తి" ఓ ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది." అని చెప్పారు.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఇలియానా, జాకీష్రాఫ్, పూజాబేడి, సోనూసూద్, నాజర్, అలీ, కృష్ణభగవాన్‌లతో పాటు చాలామంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : సత్యానంద్, ఫోటోగ్రఫీ : సమీర్ రెడ్డి, సంగీతం : మణిశర్మ, ఆర్ట్ : ఆనంద్‌సాయి, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, రచనా సహకారం : యండమూరి వీరేంద్రనాథ్, జె.కె. భారవి, తోటప్రసాద్, డి.ఎస్. కన్నన్, పాటలు : వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, దర్శకత్వ శాఖ : ఎల్.పి. రామారావు, రాజశేఖర్, మోహన్ దీక్షిత్, రామకృష్ణారెడ్డి, చందు, జెన్నీఫర్, సమర్పణ : సి. ధర్మరాజు, నిర్మాత : సి. అశ్వనీదత్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : మెహర్‌రమేష్.
About Writer
SELVI.M