Angadi theru | Telugu | Dubbing | Cinema | Tamil | త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు "అంగాడి తెరు"
FILE
తెలుగులో ఈ సినిమా హక్కులను ఓ యువ తెలుగు నిర్మాత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు శుక్రవారం చెన్నై కోదండపాణి థియేటర్లో ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
కథా పరంగా చెప్పాలంటే..? కథ చిన్నదైనా.. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హృదయాలను హత్తుకుంటుంది. ఈ చిత్రం తమిళంలో అందరి మనసులను గెల్చుకుంది. ఏ సినిమా అంత ఈజీగా రేటింద్ ఇవ్వని ప్రముఖ తమిళ పత్రికలు, వెబ్‌సైట్లు ఈ సినిమాను చూడకపోతే.. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాగా.. ఈ సక్సెస్‌ఫుల్ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.