Cinema | Srihari | Mohanbabu | Manoj | రిస్క్‌కు ఫలితం 8 నెలలు రెస్ట్
WD
యాంగ్రీ యంగ్‌మెన్‌గా మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న మంచు మనోజ్ రిస్క్ విషయంలో మొహమాటమేలేదు. 'నేను మీకు తెలుసా' చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఒరిజినల్ ఫైట్స్ సీన్స్‌లో పాల్గొన్నారు.
ఎత్తైన గోడలు దూకడం, పరుగెట్టడం, గుంతలు, రాళ్లురప్పలు లాంటివి లెక్కచేయకుండా చేశాడు. అప్పట్లో కుడిభుజానికి బలమైన దెబ్బ తగిలింది. యువరక్తం కనుక దాన్ని కాస్త అశ్రద్ధ చేశాడనే చెప్పాలి. ఆ తర్వాత ఇటీవలే విడుదలైన "ఝుమ్మంది నాదం"లో కూడా రాఘవేంద్రరావుగారు వద్దన్నా వినకుండా మరో రిస్క్ ఫైట్ చేశాడు. ఈసారి ఎడమ భుజానికి దెబ్బ తగిలింది. దీంతో మనోజ్ ఎనిమిది నెలలపాటు రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఇటీవలే తన ట్వట్టర్‌లో తమిళంలో క్రిష్ రూపొందిస్తున్న వేదంలో నటిస్తున్నట్లు తెలియజేశారు. కానీ ప్రస్తుతం తాను చేయడంలేదనీ, ఆరోగ్యరీత్యా ఎనిమిది నెలలు రెస్ట్ తీసుకుంటున్నానని అన్నారు. రెండు భుజాలకు ఆపరేషన్ చేసుకున్నా మళ్లీ కోలుకుని తమిళ, తెలుగులో రూపొందే భారీ చిత్రంతో ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఆల్ ది బెస్ట్ మనోజ్.