1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఎఫ్‌డిసిని ముట్టడిస్తాం: ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి

Prajanatya mandali, FDC, Land | ఎఫ్‌డిసిని ముట్టడిస్తాం: ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి

ప్రజానాట్య మండలి
సినీ పరిశ్రమ అభివృద్ధికోసం కేటాయించిన జూబ్లీహిల్స్ లోని ఎఫ్.డి.సికి చెందిన 30 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, సత్వరమే ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఎఫ్.డి.సిని ముట్టడించి స్తంభింపజేస్తామని - ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి చలనచిత్రశాఖ అధ్యక్ష, కార్యదర్శులు బాబ్జీ, మద్దినేని రమేష్‌లు ఓ ప్రకటనలో హెచ్చరించారు.

నిర్దేశించిన ప్రకారం ఈ స్థలంలో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ శాశ్వత వేదికను నిర్మించాలనీ, అందుకుగాను పారదర్శకంగా టెండర్లను పిలవాలని వారు కోరారు. హైటెక్ సిటీలాగా ఇక్కడ కూడా సినిమా హబ్‌ను ఏర్పాటు చేయాలనీ, ఫిలిమ్ స్టూడియోలు, మీడియా అనుబంధ సంస్థలకు భవనాలను అద్దెక్కివ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

సినిమా సంస్థలు, సినీ పరిశ్రమ వ్యక్తులు కాకుండా ఇతరులకు ఒక్క ఎకరం కేటాయించినా సహించేది లేదన్నారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి