Sameera Reddy | Romance | Tollywood | తెలుగు సినిమాల్లో శృంగారం తక్కువే: సమీర
మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌తో కెరీర్ ప్రారంభమయినా వెండితెరపై సొహైల్ ఖాన్‌తో "మైనే దిల్ తుఝ్ కో దియా"తో సినీరంగ ప్రవేశం చేసిన సమీరా రెడ్డి... తాజాగా రెడ్ అలర్ట్ చిత్రంలో మహిళా మావోయిస్టుగా నటిస్తోంది. ఈ పాత్రతో చాలా నేర్చుకున్నానని చెపుతోంది.
ఇదే తరహా పాత్రలు చేయననీ, శృంగారాత్మక చిత్రాల్లో కూడా నటిస్తానని చెప్పింది. తాజాగా ఓ తెలుగు సినిమా నిర్మాత ఆమెను ముంబైలో కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లో శృంగారం తక్కువగానే ఉంటుందని అంది. అయితే నెక్ట్స్ తెలుగులో చేస్తుందన్నమాట.
