1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Telugu film industry land

YSR | Telugu film industry land | Sale | సినిమా పరిశ్రమ భూమిని వైఎస్సార్ అమ్మేశారు

వైఎస్సార్
WD
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం కేటాయించిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం పట్ల నిరసన తెలుపుతూ తెలుగుచలన చిత్ర పరిశ్రమ శనివారంనాడు దీక్షకు దిగింది. పద్మాలయ స్టూడియో దిగువన 30 ఎకరాలను తెలుగు చిత్ర పరిశ్రమకు 1983లో ప్రభుత్వం కేటాయించింది.

కాలక్రమంలో 10 ఎకరాలు రియల్ ఎస్టేట్లకు, 20 ఎకరాలు మలేసియా టౌన్‌షిప్ సంస్థలకు ప్రభుత్వం అమ్మేసింది. ఇది వైఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. శనివారంనాడు వైఎస్ జగన్‌కు చెందిన భారత్ కంపెనీ పూజా కార్యక్రమాలు చేస్తుందని వార్తలు రాగానే ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఆ స్థలం వద్ద చుట్టుముట్టారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా బురదలోనే నినాదాలు చేశారు.

మురళీమోహన్, సాగర్, సురేందర్ రెడ్డి, నట్టికుమార్‌లతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలు శాఖల పెద్దలు ఆ స్థలం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ... పరిశ్రమ అభివృద్ధికోసం కేటాయించిన స్థలాన్ని తమకు తెలీకుండా ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అన్యాయమని అన్నారు. దీనికోసం ఇండస్ట్రీ ఏకతాటిపై నిలుస్తుందన్నారు. అవసరమైతే నిరాహారదీక్ష చేసి కొన్ని రోజులపాటు షూటింగ్‌లు ఆపేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి