YSR | Film | Bhageerathudud | వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా "భగీరథుడు"
WD
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాయి యూనివర్శల్ ఫిలిమ్స్‌పై తొలి ప్రయత్నంగా "భగీరథుడు" అనే చిత్రాన్ని నిర్మించాం. జనహృదయ నేత కోట్లాది మంది హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం గురించి తెలియజేశాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.
చిత్రం గురించి చెపుతూ... వినోద్ కుమార్, యమున వైఎస్ దంపతులుగా నటించారు. రెండవసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే సినిమా తీయాలని అనుకున్నాను. సెప్టెంబరు 10న ఆయన ప్రారంభోత్సవానికి డేట్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ 2నే దూరమయ్యారు. ఆయన వ్యక్తిగతం చూస్తే ఆయనలో రియల్ హీరో ఉన్నారు. ఎంతోమందిని ఆయన కాపాడారు.
కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే తనకంటే జూనియర్ అయిన కేవీపిని కాపాడారు. అలా వారిద్దరి మధ్య స్నేహ సంబంధం కలిగింది. అలాగే ఎంతోమంది విద్యార్థులకు ఫీజులు కట్టారు. డాక్టర్‌గా రూపాయికే వైద్యం చేశారు. ఇటువంటివి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. వాటిని తెలియజెప్పే ఉద్దేశ్యమే ఈ చిత్రం.
రాజకీయపరంగా విమర్శులున్నా వాటి జోలికి వెళ్లలేదు. ఈ చిత్రంలో ఏ రాజకీయ పార్టీని, నాయకడిని విమర్శించలేదు. ఆయన వ్యక్తిగతంగా ఏం చేశారదే పాయింట్. ఈ నెలఖారులో జగన్ ఆధ్వర్యంలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు.
ఈ చిత్రంలో మంజుభార్గవి, కెప్టెన్ చౌదరి, శ్రీహర్ష, పృధ్వీ, టార్జాన్, అశోక్ కుమార్, హాసిని తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయ్ కుమార్, డాన్స్: స్వర్ణ, సంగీతం: వరికుప్పల యాదగిరి, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: గిరిరెడ్డి