Abhishek | Aishwarya Rai | Hot | jodi | Raavan | సిల్వర్‌స్క్రీన్‌పై బోరెత్తిన ఐష్ - అభి కపుల్..?!!
FILE
వివాహమైన తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు విజయవంతమైనవి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. మొత్తమ్మదీ రావణ్ చిత్రం ఫట్‌మనడంతో ఐష్ - అభిలిద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి సినిమా తీయాలంటే నిర్మాతలు జంకుతున్నారు.
ఇదిలావుంటే ఇప్పటికే వీళ్లద్దరితో సినిమాలను మొదలుపెట్టిన దర్శకనిర్మాతలు తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టేస్తున్నారట. దీంతో ఎంతో బిజీగా కనిపించే ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్‌లు చేతులు ముందు పెట్టుక కూచోవాల్సి వస్తోందని చెపుతున్నారు.
ఈ సంగతి ఇలావుంటే కొంతమంది అభిమానులైతే... నేరుగా ఐశ్వర్యారాయ్‌కు ఉచిత సలహాలను కూడా ఇస్తున్నారట. పెళ్లికాక ముందే నటి కానీ, పెళ్లయిన తర్వాత ఇంకా చిందులేంటీ...? హేపీగా భర్తా, అత్త - మామలతో కాలం గడపవచ్చు కదా అని అంటున్నారట. మరి ఐశ్వర్యారాయ్ ఏం చేస్తుందో..?!!