Jr NTR | Telugudesam | Babli Project | Maharastra | తెలుగువాడి దమ్మేంటో మరోసారి ఢిల్లీకి చాటాలి: ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టు, అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం వారిపట్ల ప్రదర్శిస్తున్న వైఖరిపై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. తెలుగువారికి మరోసారి అవమానం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూస్తుంటే బ్రిటిష్ పాలన వచ్చిందా అనిపిస్తోందని అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేవారికి మన దమ్మేంటో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగువారంతా ఒక్క తాటిపైకి వచ్చి అవమానపరుస్తున్నవారికి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.
అయితే ఇది శాంతియుత మార్గంలోనే జరగాలని, ఒక ఉప్పెనలా తెలుగువారు ఎగసి పడాలని పిలుపునిచ్చారు. తాను రావాలనుకున్నా కులుమనాలిలో ఉండటం వల్ల రాలేక పోతున్నానని చెప్పుకొచ్చారు.