1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nitynanda

Babala Bhagotam | Nitynanda | Cinema | దేవీశ్రీ ప్రొడక్షన్స్ వారి "బాబాల భాగోతం"

బాబాల భాగోతం
FILE
నిత్యానంద స్వామి, మరో స్వామి ఇలా కొందరి జీవితాలను తీసుకుని దేవిశ్రీ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థ 'బాబాల భాగోతం' చిత్రాన్ని నిర్మిస్తోంది. సీనియర్‌ దర్శకుడు పి. చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.దేవదానం నిర్మాత. భరత్‌బాబు, శఫాలీ శర్మ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లోని మాదాలరవి హౌస్‌లో ప్రారంభమైంది.

డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాగర్‌ ఆహ్వానితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నకిలీబాబాల వలలో ప్రజలు పడకూడదనే సందేశంతో ఈ చిత్రం రూపొందుతుందని తెలిసింది. మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి వివరిస్తూ... బాబాగా శివప్రసాద్‌ నటిస్తున్నారు. ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకునే బాబాలు ఉన్నంతవరకు వారు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తునే ఉంటారు. అందుకే ప్రజల్ని చైతన్యపరిచే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రతి మనిషికి తనపై తనకు నమ్మకముండాలని చెప్పే చిత్రమిది. దర్శకుడిగా గ్యాప్‌ వచ్చినా మంచి సందేశాత్మక చిత్రంతో రావడం ఆనందంగా ఉందని' అన్నారు.

ా|| శివప్రసాద్‌ వ్యాఖ్యానిస్తూ... గతంలో పి.సి.రెడ్డిగారి చిత్రాల్లో హాస్యపాత్రలు పోషించాను. ఈ చిత్రంలోని పాత్ర అభినయానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏంపిల్లో ఏం పిల్లడో తర్వాత చేస్తున్న చిత్రమిదని తెలిపారు. నటుడు అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ, కొద్దో గొప్పో మహిమలు గల బాబాలు సమాజంలో ఉన్నారు. వారు పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. నేనూ ఓ బాబా భక్తుడ్నే. కానీ వారు ఎక్కడో దూరంగా ఉంటారు. మంచి ఆశయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

నిర్మాత దేవదానం మాట్లాడుతూ... తమకు తెలిసిన కొన్నిమంత్రాలతో ఆడవారిని లోబర్చుకునే దొంగస్వాముల బండారాన్ని బయటపెట్టే చిత్రమే ఇది అన్నారు. కెమెరామెన్‌ కంకణాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నేటినుంచి సింగిల్‌ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేయనున్నాం. వచ్చేనెల 20వరకు టాకీ పార్ట్‌ జరుగుతుందన్నారు.

ఇంకా ఈ చిత్రంలో సత్యప్రకాష్‌, రమ్యశ్రీ, కిన్నెర, సత్యశ్రీ, రామరెడ్డి, కొండవలస, చిట్టిబాబు, హేమసుందర్‌ తదితరులు నటిస్తున్నారు. కథ: దేవశ్రీప్రొడక్షన్స్‌. మాటలు: జయకుమార్‌, సంగీతం: శ్రీకాంత్‌.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి