1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nitya menon

Actor Sidharth | Nitya menon | Priya Anand | ఇద్దరు భామలతో లవర్ బాయ్ సిద్ధార్థ్ "180"

సిద్ధార్థ్
WD
సిద్ధార్థ్ ఇద్దరు భామలతో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "180" అని పేరు పెట్టారు. నిత్య మీనన్, ప్రియా ఆనంద్ సిద్ధార్థ్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఎస్పీఎల్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, అగల్ ఫిలిమ్స్ పతాకం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సిద్ధార్థ్ గురువు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ... "ఈ చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. దర్శకుడు మా కుటుంబ స్నేహితుడు. చిన్నతనంలో అంటే... పదేళ్ల వయస్సులో నన్ను ఓ యాడ్ ఫిలిమ్‌కు డబ్బింగ్ చెప్పమన్నారు.

బానిస్ అనే మస్కిటో కాయల్‌లో ఓ బాంబే కుర్రాడు నటించాడు. వాళ్ల అమ్మను "ఇది ఏమిటి..?" అని అడుగుతాడు. నేను ఆ పాత్రకు 8 భాషల్లో డబ్బింగ్ చెప్పాను. అప్పుడు నాకు 300 రూపాయలిచ్చారు. అటువంటి గురువుగారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంద"న్నాడు సిద్ధార్థ్.

ఈ సినిమాను డిసెంబరులో పూర్తి చేసి వచ్చే వేసవికాలంలో విడుదల చేస్తామని చెప్పాడు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఈ కథ ఉంటుందన్నాడు. ఈ చిత్రానికి కెమేరా: బాలబ్రహ్మన్, మాటలు: ఉమర్జీ కుమరన్, కథ - స్క్రీన్ ప్లే: శుభ, జయేంద్ర, దర్శకత్వం: జయేంద్ర
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి