1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Elections

Film Chamber of Commerce | Elections | Allu Aravind | రేపే ఫిలిమ్ ఛాంబర్ ఎన్నికలు: వృద్ధ ప్యానల్ vs యూత్ ప్యానల్

ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
తెలుగుచలనచిత్ర పరిశ్రమకు చెందిన ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు సజావుగానే జరుగుతాయని దాసరి నారాయణరావు ప్యానల్‌ స్పష్టం చేసింది. ఏడాదిపాటు కాలపరిమితి గల ఈ ఎన్నికలు ఈనెల 25 అంటే... ఆదివారం జరుగనున్నాయి.

అయితే పోటీ వర్గం సభ్యుల్లో లేనిపోని అపోహలు సృష్టించి రకరకాలుగా ఎస్‌.ఎం.ఎస్‌.లపేరుతో గందరగోళం సృషిస్తోందని అల్లు అరవింద్‌ శనివారం తెలిపారు. ఛాంబర్‌ ఎన్నికల్లో దాసరి ప్యానల్‌కు పోటీగా యలమంచి శివాజీ గ్రూప్‌ (ఇటీవలే పైరసీపై నిరాహారదీక్షచేసిన వ్యక్తి) నిలబడింది. ఒకటి యూత్‌ వర్గం, రెండోది వృద్ధవర్గం అనే పేరు ఇండిస్ట్రీలో నెలకొంది. దీంతో యూత్‌ అంతా తమవైపు రావాలని ఆ వర్గం మెసేజ్‌ల ద్వారా పంపుతుంది.

దాసరి వర్గంలో సభ్యులు కానివారు కూడా ఉన్నారని ఆరోపణలు చేసింది. దీంతో హుటాహుటిన శనివారం అల్లు అరవింద్‌, డి.సురేష్‌బాబులు వివరణ ఇచ్చారు. ఎన్ని నిందలువేసినా అసలైన ప్యానల్‌ తమదేనని తేల్చిచెప్పారు. దాసరి ప్యానల్‌లో అరవింద్‌, సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్‌, సి.కళ్యాణ్‌, శేఖర్‌బాబు. శివరామకృష్ణ.. కుమార్‌ చౌదరి, నట్టికుమార్‌. పల్లికేశవరావు. సురేందర్‌రెడ్డి. రామసత్యనారాయణ, మోహన్‌గడ్‌లు ఉన్నారు.

కాగా, ఛాంబర్‌ఎన్నికల్లో ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌, డిస్ట్రిబ్యూటర్‌ సెక్టార్‌, స్టూడియోస్‌ సెక్టార్‌, ఎగ్జిబిటర్‌ సెక్టార్‌లకు ఎన్నికలు జరుగుతాయి. అయితే శనివారమే స్టూడియోస్‌ సెక్టార్‌, ఎగ్జిబిటర్‌ సెక్టార్‌కు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. అయితే రేపు నామమాత్రంగా వారు ఎన్నికల్లో పాల్గొంటారు. అసలు పోటీ అంతా ప్రొడ్యూసర్‌ సెక్టార్‌కు, డిస్ట్రిబ్యూటర్‌ సెక్లార్‌దే. ఇద్దరికీ రేపు గట్టిపోటీ ఉంది. మరి ఏ ప్యానల్‌ గెలుస్తుందో చూడాలి.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి