Kalyani | Surya Kiran | Gossips | చెయ్యి, కాలు పడిపోయినంతగా ఫీలయ్యాను: కళ్యాణి
WD
దీనిపై కళ్యాణి శనివారం స్పందించింది. ఏదో గాలివార్తలు రాసే వెబ్‌సైట్ అలా రాసేసరికి నాకు ఒక చెయ్యి, కాలు పడిపోయినంతగా ఫీలయ్యాను. ఏమో.. సూర్యకిరణ్ అలాంటివాడేనన్న లేనిపోని అనుమానం రేపినట్లుయింది. "దయచేసి ఇలాంటి వార్తలు రాసి మా మధ్య చిచ్చుపెట్టకండి." అంటూ వేడుకుంది.
అయితే గాలివార్తను చూసి స్పందించడం అంత అవసరమా? అని అడిగితే... ఇలా వదిలిస్తే.. నిజమేనని ఇండస్ట్రీ అంతా అనుకుంటుందని చెప్పింది. "అసలే తెలుగు ఇండిస్ట్రీ మాకు కొత్త. మాకు బ్యాక్‌బోన్స్ ఎవరూలేరు. మా జాగ్రత్తలో మేం ఉండాలికదా.." అంది. ఇదే అభిప్రాయాన్ని సూర్యకిరణ్ వ్యక్తం చేస్తూ... "పదిసార్లు కుక్కను పిల్లి అంటే పిల్లి అవుతుందని ఇది అలాగే గనుక చెప్పాల్సివచ్చింద"ని అన్నారు.