1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. నన్నెందుకు హీరోగా నిలబెట్టలేకపోయారు..?: సాయికుమార్

Saikumar, Dubbing artist, Actor, Cinema, Aditya, Hero | నన్నెందుకు హీరోగా నిలబెట్టలేకపోయారు..?: సాయికుమార్

సాయికుమార్
FILE
నటుడు, డబ్బింగ్ కళాకారుడు అయిన సాయికుమార్‌ మంగళవారానికి 50 ఏట అడుగుపెట్టారు. 50వ పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడు ఆదిత్య హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉన్నప్పటికీ, తాను నటునిగా ఇంకా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాననే ఫీలింగ్ వెంటాడుతుందని చెప్పారు.

ఇంకా సాయికుమార్ మాట్లాడుతూ.."కన్నడ, తమిళ, హిందీ చిత్రాలతో పాటు వెయ్యి సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. కానీ నటుడిగా ఇంకా ఎదగకలేకపోయాను. దానికి కారణాలు ఏమిటనేవి ఇప్పటికీ అర్థంకావు. దర్శకులు నన్ను ఎందుకు సరైన హీరోగా చేయలేకపోయారు..?. సుమన్, రాజశేఖర్‌లకు డబ్బింగ్ చెబితే వారి సినిమాలు హిట్ అయ్యాయి. మరి నేను నటిస్తే ఎలా ఉండేది? అని నాకై నేను ప్రశ్నించుకున్నా..?" అర్థంకాలేదని అన్నారు.

1974లోనే 'సంసారం' చిత్రంతో తన డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైందని, అప్పటికీ ఇండస్ట్రీలో మంచిపేరు తెచ్చుకున్నానని సాయికుమార్ అన్నారు. త్వరలో మమ్ముట్టితో కలిసి మలయాళ సినిమాలో నటించనున్నట్లు ఆయన వెల్లడించారు. తొలిసారిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు.

గతంలో తాను రాజకీయాల వైపు మళ్లినా ప్రస్తుతం అటువైపు ఆలోచించడం లేదని సాయికుమార్ చెప్పారు. ఎంతోమంది నటులు నా వాయిస్ బాగుందని మెచ్చుకుంటే ఆనందంగా ఉందని, అదే ఒకరకంగా నటుడిగా తన ఎదుగుదలకు బ్రేక్ వేసిందేమోననే అనుమానం కూడా ఉందని సాయికుమార్ చెప్పుకొచ్చారు.
About Writer
SELVI.M