Actor Balakrishna | Dasari | Kumar Chowdary | Puri Jagannath | బాలయ్య చేస్తుంది కరెక్టేనా...?
WD
అయితే ఆ తర్వాత బాలయ్యకు సక్సెస్‌లు రాకపోవడంతో బోయపాటి శీను సింహా కథ చెప్పడంతో దానిని ఛాలెంజ్‌గా తీసుకుని హిట్ కొట్టారు. ఆ ఊపులో దాసరి నారాయణరావు చిత్రం పరమవీరచక్రకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో ప్రారంభమైంది. ఏమైందోగానీ తాజాగా ఎం.ఎల్ కుమార్ చౌదరితో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పినట్లు తెలిసింది.
మరి ఈ లైన్‌ను నిర్మాత ఎలా చెప్పాడోగానీ ఒకేసారి రెండు సినిమాలు పెట్టుకున్నారు. ఇలాగే బెల్లంకొండ సురేష్‌తో పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పూరీ చెప్పిన వర్షెన్ బాలయ్యకు నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే కుమార్ చౌదరి చెప్పిన కథ ఎలా నచ్చిందోనని ఫిలిమ్ నగర్ జనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించనున్నాడు. వీరిద్దరి కాంబినేషల్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొని ఉంది. మరి దాసరి సినిమా పూర్తయ్యాక చేస్తాడా...? ఏమవుతుందో చూద్దాం....