Gopichand | Deeksaseth | Bhavya Creations | గోపీచంద్ - దీక్షా సేథ్ జంటగా భవ్య క్రియేషన్స్ చిత్రం
గోపీచంద్ "శౌర్యం" వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనందప్రసాద్, మళ్లీ గోపీచంద్‌తో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "శౌర్యం"తో కెమెరామేన్ శివను దర్శకునిగా పరిచయం చేసిన ఆనంద ప్రసాద్, ఈసారి సంభాషణల రచయిత రవిని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు.
భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన వేదం ఫేమ్ దీక్షా సేథ్ కథానాయికగా ఎంపికయ్యారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇందులో ముఖ్యభూమిక పోషించనున్నారు. నిర్మాత వి. ఆనందప్రసాద్ చిత్ర విశేషాలను వివరిస్తూ... మా సంస్థకు అత్యంత ఆత్మీయుడైన గోపీచంద్‌తో రెండో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
లవ్, యాక్షన్, ఎంటర్‌టైనర్‌ల కలబోత ఇది. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణ విభిన్నంగా ఉంటుంది. సత్యం, భద్ర, పరుగు, కింగ్ వంటి విజయవంతమైన చిత్రాలకు సంభాషణలు అందించిన రవిని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం, చక్రి సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్టు 12న హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: శంకర్, ఆర్ట్: వివేక్, పాటలు: భాస్కరభట్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, నిర్మాత: వి. ఆనంద ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే- మాటలు - దర్శకత్వం: రవి