దిల్‌సుఖ్‌నగర్ ఎరీనా యానిమేషన్‌కు 2010కిగాను బెస్ట్ యానిమేషన్ కింద ఫీల్ ది పంచ్ ఎంపికైంది. అదేవిధంగా పొల్యూషన్‌పై వైస్సార్ మరణానంతరంపై తీసిన 3డి యానిమేషన్ కూడా అవార్డులు దక్కాయి. వీటిని చేసిన సాంకేతి సిబ్బంది హైదరాబాద్‌కు చెందినవారు కావడం విశేషమనీ వారు మూడు నెలలుగా కష్టపడి పనిచేశారని ఎరీనా సీఈఓ రాజశేఖర్ తెలిపారు.
ది యానిమేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ అవార్డులను ప్రకటించిందన ఆయన అన్నారు. సినిమాలకూ మా టాలెంట్‌ను ఉపయోగించుకోమని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, దర్శకుడు బోయపాటి శ్రీను పాల్గొన్నారు. టాలెంట్‌ను ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు.