Krishnudu | Chandrudu | Nehadhupia | "చంద్రుడు"గా దస్‌వీదానియా
హిందీలో హిట్ అయిన "దస్‌వీదానియా" చిత్రాన్ని తెలుగులో "చంద్రుడు"గా రీమేక్ చేస్తున్నారు. టైటిల్ రోల్‌ను కృష్ణుడు పోషిస్తున్నాడు. రాజ్ కుమార్ చందక, పి.ఎస్. చంద్ర నిర్మాతలుగా పెళ్లికాని ప్రసాద్‌తో దర్శకుడయిన సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
నేహాధూపియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ రీమేక్ హక్కులను ఉషా సినీస్టూడియోస్‌పై తాము దక్కించుకున్నామని నిర్మాతలు తెలిపారు. కృష్ణుడు మాట్లాడుతూ... హిందీలో చాలాసార్లు ఈ చిత్రాన్ని చూశాను. నాకే ఈ అవకాశం రావడం లక్‌గా భావిస్తున్నాను.
శ్రేయోభిలాషులు ఈ చిత్రం తనకే సూటవుతుందన్నారు. మంచిపేరు తెస్తుందనే ఆశిస్తున్నాను అన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది.
