Sumanth | Priyamani | Vimalaraman | రెగ్యులర్ షూటింగ్‌లో కుమార్ బ్రదర్స్ చిత్రం
WD
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... న్యమైన కథ, కథనాలతో అన్ని వర్గాలు మెచ్చే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సుమంత్ పాత్ర కొత్తగా ఉంటుంది. అతని కెరీర్‌లో ఇప్పటివరకూ పోషించనటువంటి విభిన్నమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాడు.
ప్రస్తుతం సుమంత్, ప్రియమణి, విమలారామన్, ఇతర ముఖ్యతారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 9 నుంచి బ్యాంకాక్, పటాయాల్లో మూడు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. 15 రోజులపాటు అక్కడి పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తాం" అన్నారు.