Takita Takita | Bhumika | Bharat Tagore | "తకిట తకిట" టూర్‌లో భూమిక, భరత్ ఠాకూర్
WD
సెప్టెంబరు 2న విజయవాడ ఐనాక్స్, గుంటూరు నాగార్జున హోటల్‌లో తకిట తకిట టీమ్ మీడియాను, ప్రేక్షకులను కలుసుకుంటారు. సెప్టెంబరు 2 రాత్రి హైదరాబాదులో తెలుగు చలనచిత్ర ప్రముఖులందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున తకిట తకిట ప్రీమియర్ షో వేయనున్నారు.
7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తకిట తకిట గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. భూమిక ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషించింది. నాగార్జున, అనుష్క మామీద అభిమానంతో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం ఈ చిత్రానికి చాలా పెద్ద ప్లస్‌పాయింట్ అయింది. లవ్ స్టోరీస్‌లో తకిట తకిట ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది అన్నారు నిర్మాత భరత్ ఠాకూర్.
ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, సంగీతం: బోబో శశి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఎ.రామ్, నిర్మాత: భరత్ ఠాకూర్, దర్శకత్వం: శ్రీహరి నాను