Raktha Charitra | Tamil sentiments | Ramgopal Varma | తమిళుల మనోభావాలను కించపరుస్తున్న "రక్త చరిత్ర"
WD
ఇంతకీ తమిళులను రక్త చరిత్ర ఏవిధంగా కించపరుస్తుందీ అని సదరు పార్టీని అడిగితే... పరిటాల రవి పాత్రను పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ శ్రీలంకలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐతోపాటు ఇతర సినిమా షూటింగ్‌ల్లో పాల్గొన్నారట. తమిళులకు వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించారు కనుక ఆయన నటించిన రక్త చరిత్ర కూడా తమ రాష్ట్రంలో ప్రదర్శనకు అర్హం కాదని అంటున్నారు.
పైగా శ్రీలంకలో చిత్రించే సినిమాల్లో పాల్గొన్న నటీనటులకు సంబంధించిన సినిమాలను తమిళనాడులో ప్రదర్శించకూడదని కోలీవుడ్ సినిమా పరిశ్రమ ఇప్పటికే ఓ తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో ఒబెరాయ్ నటించిన రక్త చరిత్ర తమిళనాట ప్రదర్శించడానికి తాము ఒప్పుకోమని హిందూ మక్కల్ కచ్చి అంటోంది. మరి వర్మ ఏం చేస్తారో...?