Madamrigam | Kishore | Sasi | Leena | Swati | విభిన్న కథాంశంతో అందరినీ ఆకట్టుకునే "మదమృగం"
కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధానపాత్రల్లో సమీర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన "ద్రోహం" చిన్న చిత్రాల్లో గొప్ప కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణో ఫిలిమ్స్ పతాకంపై మదమృగం పేరుతో నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మొదటివారంలోనే 3కోట్ల రూపాయలను వసూలు చేసి చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా మంచిపేరు తెచ్చుకుంది. చూసిన ప్రతిదీ తన సొంతం అయిపోవాలనుకునే ఓ జమీందార్ కొడుకు కథ ఇది.
ఒకరోజు ఓ పోలీస్ ఆఫీసర్ భార్య ఇతని కంట్లో పడుతుంది. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు. దానికోసం ఒక పథకం వేసి ఆమె ఇంటికి వెళ్లి ఆమె వెనుక నుంచి కౌగలించుకుంటాడు. అదే టైమ్‌లో ఫోటో తీసేలా ప్లాన్ చేసి ఆ ఫోటోతో బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఇతను సైకో కాదు.. హంతకుడు కాదు. కానీ, ఒక డిఫరెంట్ మెంటాలిటీతో అందరినీ హడలెత్తిస్తుంటాడు. అయితే చివరికి ఏం జరిగింది. ఆతని ఆగడాలను ఎలా అరికట్టారన్నది కథాంశం.
కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వెంకట్, సంగీతం: మనీష్, నిర్మాత: సి.హెచ్. సీతారామిరెడ్డి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సమీర్
