Rajendra Prasad | Nityananda | Ayyare | నిత్యానంద స్వామి గెటప్‌లో నటకిరీటి రాజేంద్రప్రసాద్
WD
శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర కథ బాగా నచ్చటంతో తాను ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని అన్నారు. ఏటీఎం సెంటర్ ముందు గార్డ్ గా పనిచేసే పాత్ర నాది. అంటువంటి వ్యక్తి ఇలా ఎందుకు మారాడు..? అన్నది కథ. శివాజీతో కలిసి నటిస్తున్నాను. సాయికుమార్ కూడా మంచి పాత్ర పోషిస్తున్నారు అని చెప్పారు.
ఈ చిత్రం షూటింగ్ నిరంతరాయంగా సింగిల్ షెడ్యూల్లో పూర్తవుతుందని దర్శకుడు సాగర్ చంద్ర అన్నారు. గతంలో రాజేంద్రప్రసాద్ మూడుముళ్ల బంధం చిత్రాన్ని తీసిన రంగన అచ్చప్ప ఈ చిత్రానికి నిర్మాత.