Rang the donga | Srikanth | Ramyakrishna | Vimalaraman | వచ్చే నెలలో శ్రీకాంత్, విమలా రామన్‌ల "రంగ ది దొంగ"
WD
జి.ఆర్. మనోహర్ నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో హైదరాబాదులో విడుదలైంది. శ్రీకాంత్ మాట్లాడుతూ.. వంద సినిమాలు చేస్తున్న తర్వాత ఇటువంటి కథను జీవీ ఎలా డీల్ చేస్తాడోనని అనుమానం వచ్చింది. అయితే కొద్ది రోజులు షూటింగ్ తర్వాత ఆయనపై పూర్తి నమ్మకం ఏర్పడింది. చక్రి చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. ఇందులో రెండు పాత్రలు పోషించాను. తప్పకుండా విజయవంతమవుతుందని అన్నారు.
చక్రి మాట్లాడుతూ.. శ్రీకాంత్‌తో 6వ సినిమా. అన్ని రసాలు ఉన్న కథ ఇది. ఐదుపాటలు ఒక్కో తీరుగా ఉంటాయి. ఆడియో తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా రంగంలో అందరూ ఎంతో ప్రేమించారు. వారందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఫ్యాక్షన్ వల్ల నష్టపోయే బడుగు, బలహీనవర్గాల ప్రజల బాధలను కళ్లకుకట్టినట్లు చూపెడుతున్నాను అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రవిప్రకాష్, సి.కల్యాణ్,బి.గోపాల్, ఎస్వీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.