1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Varun Sandesh

Emaindi Eevela film | Varun Sandesh | Nisha Agarval | వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ "ఏమైంది ఈవేళ"

ఏమైంది ఈవేశ
WD
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి సూపర్ హిట్ చిత్రాల యువహీరో వరుణ్ సందేశ్, ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఆరిమిల్లి రామకృష్ణ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేసనపల్లి రాధామోహన్ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రానికి "ఏమైంది ఈవేళ" అని పేరుపెట్టారు.

ఈ చిత్రం గురించి నిర్మాత కేసనపల్లి రాధామోహన్ మాట్లాడుతూ.. మా చిత్రానికి ఎన్నో టైటిల్స్ అనుకున్నాం. నాలుగైదు టైటిల్స్ పరిశీలించి వీటిలో ఏ టైటిల్ బెస్ట్ అవుతుందని అన్ని సర్కిల్స్‌తో డిస్కస్ చేసి మెజారిటీ ఓపీనియన్‌ను బట్టి ఏమైంది ఈవేళని ఫిక్స్ చేశాం. ఏమైంది ఈవేళ కథలో చాలా నావెల్టీ ఉంది. వరుణ్ సందేశ్‌కి ఇది మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది. పాటలు మినహా షూటింగ్ పూర్తయింది అన్నారు.

వరుణ్ సందేశ్, శశాంక్, నిషా అగర్వాల్, నిషా, వెన్నెల కిషోర్, కిషోర్, ఎం.ఎస్. నారాయణ, కృష్ణ భగవాన్, ఝాన్సీ, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఫోటోగ్రఫీ: బుజ్జి, ఆర్ట్: డి.వై. సత్యనారాయణ, ఎడిటింగ్: ముత్యాల నాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: ఆరిమిల్లి రామకృష్ణ, నిర్మాత: కేసనపల్లి రాధామోహన్, కథ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: సంపత్ నంది
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి