1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ''కింగ్‌'' నాగార్జునతో అగ్రనిర్మాత శివప్రసాద్‌రెడ్డి చిత్రం

Nagarjuna, | ''కింగ్‌'' నాగార్జునతో అగ్రనిర్మాత శివప్రసాద్‌రెడ్డి చిత్రం

కింగ్ నాగార్జునతో అగ్రనిర్మాత శివప్రసాద్రెడ్డి చిత్రం
విక్కీదాదా నుండి రగడ వరకు కింగ్‌ నాగార్జునతో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన కామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత, అగ్రనిర్మాత డి.శివప్రసాద్‌ రెడ్డి మళ్ళీ నాగార్జున హీరోగా జనవరి నుంచి ఓ భారీ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ - ''నాగార్జునగారితో కామాక్షి బేనర్‌లో జనవరి నుంచి మరో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఆగస్ట్‌ 12న చైతన్య 'దడ' రిలీజ్‌ చేస్తున్నాం.

ఆగస్ట్‌ చివరి వారంలో నాగార్జునగారి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం. నాగార్జున - కామాక్షి కాంబినేషన్‌లో ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తాం'' అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT