1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tea

Srihari | Tea | Samosa | Biscut | New Film | D Rama Naidu | Tollywood | శ్రీహరి హీరోగా "టీ.. సమోసా... బిస్కట్"

శ్రీహరి
WD
WD
పీపుల్స్‌ థియేటర్‌ పతాకంపై ప్రజానాట్యమండలి కళాకారుడు బాబ్జీ నిర్మిస్తున్న 'టీ సమోసా బిస్కెట్‌' చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రియల్‌స్టార్‌ శ్రీహరిపై ముహూర్తపు షాట్‌ చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో శ్రీకాంత్‌ క్లాప్‌ కొట్టారు. డా|| డి. రామానాయుడు తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. ఈ టైటిల్‌ వినగానే ఇటువంటి సినిమాలో నేను చేయడం ఏమిటి? అని బాబ్జీని అడిగాను. కథ వినమన్నారు. కొత్త పాయింట్‌లా అనిపించింది. గమ్మత్తయిన పాయింట్‌ ఇది. కథకు నాకు తెలిసిన మార్పులు చెప్పాను చేశారు. హైదరాబాద్‌ అనగానే ఛార్మినార్‌, గోల్కొండ, బిర్లా టెంపుల్‌, ఇరానీ చాయ్‌ ఫేమస్‌.

సామాన్యుడు కూడా కబుర్లతో చక్కగా కూర్చొనే చోటు ఇరానీ కేఫ్‌. కానీ నేడు అవన్నీ కాపీభార్‌లుగా మారిపోయాయి. సామన్యుడు చాయ్‌ తాగే అర్హత కోల్పోయాడు. వారికి దూరమైంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కొత్తగా బాబ్జీ చెప్పాడు. నా చిత్రాల్లో హీరోయిన్‌ పాత్ర పరిమితం. కానీ హంసానందిని హీరోయిన్‌గా నాతో పాటు ట్రావెల్‌ అవుతుంది. వివరించారు.

అనంతరం సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, కళ.. కళ కోసం కాదు. ప్రజల కోసం అని పని చేసే ఈ ప్రజానాట్యమండలి నుంచి విచ్చేసిన బాబ్జీ హైదరాబాద్‌ నేపథ్యంలో సినిమా తీస్తున్నాడు. హైదరాబాద్‌లో సామాన్యుడు టీ కూడా తాగే స్థితిలో లేడు. ప్రపంచ సరళీకరణ వల్ల పేదల బతుకులు భారమయ్యాయి. 30 ఏళ్ళుగా హైదరాబాద్‌ను చూస్తున్నాను. అప్పటి ఇరానీ చాయ్‌ నేడు లేదు. మంచి భావాన్ని ప్రజల్లో తీసుకు వెళ్ళే బాబ్జీ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత, దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ... ప్రజానాట్యమండలి కళాకారుడిగా నిర్మాణ సంస్థను స్థాపించి ఆ పేరు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అనే పేరు ప్రఖ్యాతి చెందింది. ఎంతోమంది కళాకారులు అక్కడ నుంచి వచ్చారు. కానీ ఆ పేరు బేనర్‌గా ఎవ్వరూ పెట్టలేదు. ఆ అవకాశం నాకే దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు.

నారాయణ గారి చేతుల మీదుగా సినిమా ప్రారంభంకావడం మరింత సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రం శ్రీహరికి డిఫరెంట్‌ పాత్రను తనే కథవిని అన్నారు. పోలీసు, గూండా వంటి పాత్రలు వేసిన శ్రీహరికి నిజంగా కొత్త పాత్ర. కామన్‌మ్యాన్‌ పాత్ర. ఒక్కముక్కలో కథ చెప్పాలంటే... ఈ చిత్రంలో ఓ పాట ఉంది 'పేదవాడికి నగరంలో చోటిలేదన్నా.. ఇరానీ హోటల్‌ అండగా ఉందన్నా..' అనేపాట. ఇదే చిత్ర కథ.

ఇందులో అన్ని పాత్రలు తమ సమస్యలతో హోటల్‌కు వచ్చి కన్నీళ్లు, ఆనందాలు పంచుకుంటారు.
ఇరానీ హోటల్‌ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ రోజు నుంచి 10 రోజులు షూటింగ్‌ జరుగుతుంది. రెండో షెడ్యూల్‌ ఇరానీ హోటల్‌ సెట్‌ వేస్తున్నాం. దానిలో 80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత మూడో షెడ్యూల్‌‌లో పాటలు తీస్తాం. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో హంసానందిని, నరేష్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్‌, నల్లూరి వెంకటేశ్వర్లు
(అన్నా), షిండే, భరణి, బాబూమోహన్‌, చాణుక్య, దనరాజ్‌, కమల్‌, మునిచంద్ర, శోభనానాయుడు, కవిత, సిరివెన్నెల అనిల్‌, మధు చక్రవర్తి తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వి. శ్రీనివాసరెడ్డి, సంగీతం: చక్రి, ఆర్ట్‌: రమణ, రచన, నిర్మాత, దర్శకత్వం: బాబ్జీ.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి