Nagarjuna | Rajanna Cinema | September 30 | రాజన్న పాత్ర చేయడం నాకు తృప్తినిచ్చింది: నాగార్జున
WD
అంతగా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన పాయింట్ ఏంటి..? అని నాగార్జునను అడిగితే, రాజన్న క్యారెక్టర్ నాకు ఎంతగానో నచ్చింది. ఇది ఓ ఫ్రీడమ్ రియలిస్టిక్ సబ్జెక్ట్. రాజన్న పాత్ర చెయ్యడం నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. విజయేంద్రప్రసాద్ గారు రాజన్నని బాగా డీల్ చేశారు. యాక్షన్ సన్నివేశాల్ని తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్ని ఎంతో ఇంట్రెస్ట్‌తో చిత్రీకరించారు. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.
సెప్టెంబరు 30న విడుదల
అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజన్న చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా సెప్టెంబరు 30న చాలా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ తోపాటు కర్నాకట, తమిళనాడు, ఒరిస్సా, నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లలో రాజన్న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, స్నేహ, బేబే ఏని, శ్వేత మీనన్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పర్యవేక్షణ: రాజమౌళి, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే - మాటలు -దర్శకత్వం: విజయేంద్రప్రసాద్