1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Upasana

Ram charan | Upasana | Polo and riding club | sports | Hyderabad | ఉపాసన నా జీవితాన్ని మార్చేస్తుంది: రామ్ చరణ్‌

రామ్ చరణ్
తన జీవితంలోకి ఉపాసన వచ్చాక నటనే కాకుండా వ్యాపారాల్లో సరైన సలహాలిచ్చి ప్రోత్సహిస్తుందని వర్ధమాన నటుడు రామ్‌ చరణ్‌ అన్నారు. షూటింగ్‌ బిజీల్లో హాబీస్‌ పక్కన పెడుతున్నాం. వాటిని ఎంకరేజ్‌ చేసి సరైన మార్గంలో తీసుకెళ్ళేలా ఉపాసన చేసిందని ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని రామ్‌ చరణ్‌ చెప్పాడు.

హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో 'ఆర్‌.సి. హైదరాబాద్‌ పోలో అండ్‌ రైడింగ్‌ క్లబ్‌' ఆధ్వర్యంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ పోలో టీమ్‌ను ఆయన ప్రారంభించారు. పోలో టీమ్‌కు రామ్‌చరణ్‌ ఓనర్‌. హైదరాబాద్‌ టీమ్‌ సభ్యులు టాస్‌ గెలిచి ఆటను ప్రారంభిస్తున్నారు.

రేపటి నుంచి ఆట సికింద్రాబాద్‌లోని గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. 18న ఫైనల్‌ జరుగుతుంది. అక్టోబర్‌లో ఢిల్లీలోనూ, డిసెంబర్‌లో జయపూర్‌లో ఆడతారనీ చెప్పారు. తాను హైదరాబాద్‌ టీమ్‌లో ఆటగాడిననీ, టీమ్‌కు ఓనర్‌నని చెప్పాడు రాంచరణ్ తేజ. యూత్‌ను ప్రోత్సహించేందుకు ఈ గేమ్‌ను టేకప్‌ చేసినట్లు చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT