Ramcharan | Upasana | Magadheera | Secundrabad | Polo Grounds | సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో చరణ్-ఉపాసనల హల్‌చల్!
WD
సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో జరిగే పోలో పోటీలను తిలకించేందుకు రామ్‌చరణ్, ఉపాసనలు హాజరయ్యారు. తొలిసారి పబ్లిక్ ముందుకొచ్చిన ఈ జంట చూడముచ్చటగా అందరినీ ఆకట్టుకున్నారు. తన పోలో టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు వచ్చిన రామ్ చరణ్ గుర్రంపై విన్యాసాలు కూడా చేశాడు. దీన్ని తిలకించిన ఉపాసన చెర్రీని అభినందించింది.
మొత్తానికి పోలో గ్రౌండ్స్‌లో చెర్రీ, ఉపాసనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చరణ్-ఉపాసన పోలో పోటీలను జంటగా తిలకించడం ద్వారా మైదానంలో సందడి వాతావరణం నెలకొంది.