Prakash Raj | Dhoni cinema | ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ''ధోని'' చిత్రం
జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్‌రాజ్ డ్యూయెట్ మూవీస్ అనే స్వంత చిత్ర నిర్మాణసంస్థపై 'ధోనీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన నటిస్తూ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
ప్రకాష్‌రాజ్ మొళి, అభియుమ్ నానున్ (ఆకాశమంత), ఇనిదు ఇనిదు, పయనం (గగనం) వంటి చిత్రాలను నిర్మించారు. సిసిమా రూపకల్పన అన్నది చక్కటి వర్ణ చిత్రం గీయటం లాంటిదే. నటుడు ఆ పెయింటింగ్‌లో అందమైన రంగులాంటివాడు. ఈ వర్ణ చిత్రానికి రసమయమైన రంగులు కలిపే వ్యక్తే దర్శకుడు. నా తొలి సినిమా డ్యూయెట్‌తో ప్రారంభించి పలువురు నిర్దేశకులు వివిధ భాషల్లో రూపొందించిన అనేక వర్ణ చిత్రాలలో నేను రంగుగా లీనమయ్యాయని ప్రకాష్‌రాజు అంటున్నారు.
ఈ చిత్రానికి ఇళయారాజా సంగీతం సమకూరుస్తుండగా, సీతారామశాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. చాలాకాలం తర్వాత ఇళయరాజా ఈ సినిమా కోసం అన్ని గీతాలను లైవ్ రికార్డింగ్ చేశారు.
ఇప్పటికే చిత్ర రూపకల్పన ప్రారంభమైంది. అక్టోబర్ నెల వరకు ఏకధాటిగా హైదరాబాద్, చెన్నైలలోని పలు ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకునే ధోని డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు ప్రకాష్‌రాజ్ చెప్పారు. ఇంకా ఇతర పాత్రలను రాధిక ఆప్టే, భరణి, బ్రహ్మానందం, నాజర్ తదితరులు పోషిస్తున్నారు. కెమెరా: కెవి గుహన్, ఎడిటర్: కిషోర్, నిర్మాత, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్.