Dookudu | Madatha kaja | Mahesh Babu | Naresh | "మడత కాజా" "దూకుడు"ని మడత పెడుతుందట
WD |
కానీ అల్లరి నరేష్ మాత్రం "మడతకాజా" తినిపిస్తానని చెబుతున్నాడు. మొన్ననే హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా దూకుడు కలెక్షన్లకు స్పీడ్‌బ్రేకర్ మా చిత్రమని సెలవిచ్చింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ కథతో తయారైన ఈ చిత్రాన్ని చూసినవారంతా దూకుడును మర్చిపోతారని నర్మగర్భంగా చెప్పింది.
ఇప్పుడు అదేవిషయాన్ని నరేష్ చెబుతున్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అనుకున్న ప్రకారం మడతకాజా విడుదలై రికార్డ్‌లను మడతపెట్టేస్తుందని సెలవిచ్చాడు. అయితే ఎవరి రికార్డులను మడతెడుతుందని అడిగితే మాట దాటేశాడు.
తన చిత్రాలపై తనకున్న నమ్మకం అటువంటిందన్నాడు. పైగా ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న చిత్రాలు బాగా ఆడాలని అంటున్నాడు. అంతేగదా.. ఏడాదికి కనీసం నాలుగు చిత్రాల్లో నటించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు మరి.