1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Genelia

Rana | Genelia | Naa Istam | నేటి నుంచి హైదరాబాద్‌లో ''నా ఇష్టం'' మూడో షెడ్యూల్

రానా
బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించిన 'సింహా'వంటి పవర్‌ఫుల్‌, సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని నిర్మించిన ప్రతిష్టాత్మక యునైటెడ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ప్రకాష్‌ తోలేటిని దర్శకునిగా పరిచయం చేస్తూ దగ్గుబాటి రానా హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం 'నా ఇష్టం'.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న 'నా ఇష్టం' మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఈనెల12న ప్రారంభమై వచ్చే నెల5 వరకు జరగనుంది. హీరో హౌస్‌ మరియు హీరోయిన్‌ హౌస్‌కు సంబంధించిన సన్నివేశాలను, కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను మరియు ఐటమ్‌సాంగ్‌ను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. రానా, జెనీలియాతోపాటు ఆలీ, విజయ్‌, చిత్రం శ్రీను తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు. ఫీల్‌గుడ్‌ యూత్‌ఫుల్‌ మూవీగా రూపొందుతున్న 'నా ఇష్టం' చిత్రం రానా సినీ కెరీర్‌లో ఓ చక్కటి చిత్రంగా నిలుస్తుంది.

రానా, జెనీలియా, బ్రహ్మానందం, హర్షవర్ధన్‌, నాజర్‌, రఘుబాబు, ఆహుతిప్రసాద్‌, ఆలీ, అజయ్‌, భరత్‌, ఉత్తేజ్‌, చిత్రం శ్రీను, శ్రీనివాసరెడ్డి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, ఫృధ్వి, జోగి బ్రదర్స్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సినిమాటోగ్రఫి: వెంకట్‌ప్రసాద్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, రచన: కోన వెంకట్‌, రచనా సహకారం: చంద్రశేఖర్‌ టి. రమేష్‌, వేమారెడ్డి, శ్రీకర్‌, కో డైరెక్టర్‌: తిరుమల కుమార్‌, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌: శ్రీకర్‌, ప్రసాద్‌, రామకృష్ణ, శ్రీధర్‌, శశిధర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: జి.గోపాలకృష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: మోహన్‌ పరుచూరి, నాగు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: మణికంఠ, పిఆర్‌ఓ: రాఘవేంద్రరెడ్డి. నిర్మాత: పరుచూరి కిరీటి,కథ-మాటలు - స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: ప్రకాష్‌ తోలేటి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT