1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Deeksha Seth

Vikram | Deeksha Seth | Veedinthe by Birth | విక్రమ్, దీక్షాసేథ్‌ల ''వీడింతే.. బై బర్త్‌''

విక్రమ్
WD
విక్రమ్‌, దీక్షాసేథ్‌ జంటగా నటించిన 'రాజా పాట్టె'' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'వీడింతే.. బై బర్త్‌' అంటూ అనువదిస్తున్నారు. పొట్లూరి ప్రసాద్‌ నిర్మాత. సుశీంద్రన్‌ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ సోమవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో విడుదలైంది. డి.సురేష్‌బాబు విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని తమ సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నామని ప్రకటించారు. ఈ చిత్రంలో విశ్వనాథ్‌, శ్రియ, రీమాసేన్‌, సలోని, ప్రదీప్‌రావత్‌ తదితరులు నటించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు.

విక్రమ్‌ మాట్లాడుతూ, నాన్న చిత్రం తర్వాత మాస్‌ మసాలా చిత్రాన్ని చేయాలని సుశీని అడిగాను. ఆయన వైవిధ్యమైన కథను తీసుకువచ్చారు. ఇందులో పలు గెటప్స్‌ ఉంటాయి. వీడింతే బైబర్త్‌ అనేది ఏమిటో తెరపై చూడాల్సిందే అన్నారు. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT