1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Arya

Anushka | Arya | pvp Banner | Selvaraghavan | Vedinte | Vikram | Deeksha Seth | పీవీపీ బ్యానర్‌లో ఆర్య, అనుష్క జంటగా కొత్త చిత్రం!

ఆర్య
WD
ప్రెస్టిజీయస్ పీవీపీ సినిమా బ్యానర్‌లో తెలుగు, తమిళ భాషల్లో మరో చిత్రం ప్రారంభమైంది. ఆర్య, అనుష్క జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం శనివారం (24) రామోజీ ఫిల్మ్ సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో విక్రమ్, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా "వీడింతే" విడుదలకు సిద్ధంగా ఉంది. ఇపుడు ప్రారంభమైన నూతన చిత్రానికి సంగీతం హేరీస్ జయరాజ్ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిత్రం గురించి తెలియజేస్తూ.. దర్శకుడు సెల్వరాఘవన్ చెప్పిన కథ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథకి ఆర్య, అనుష్కలు వంద శాతం యాఫ్ట్. అలాగే హేరిస్ జయరాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మంచి కమర్షియల్ విలువలతో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం పివిపి సినిమా బ్యానర్ నుండి వచ్చే మరో గొప్ప చిత్రం అవుతుంది వెల్లడించింది.

ఆర్య, అనుష్క, ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కెమెరామేన్ : రామ్‌జీ, ఆర్ట్‌ డైరక్టర్ : కిరణ్, ఎడిటింగ్ : కోలా భాస్కర్, సంగీతం : హేరిస్ జయరాజ్, నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి, దర్శకత్వం : సెల్వ రాఘవన్.