Anna Hazare | Rajinikanth | Lokpal Bill | Chennai | అన్నా హజారే కోసం రజినీకాంత్ "రాఘవేంద్ర కల్యాణమండపం"
అన్నా హజారే అవినీతిని అంతమొందించే బ్రహ్మాస్త్రం లోక్పాల్ బిల్లుకోసం ముంబైలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నా చేస్తున్న దీక్షకు సంఘీభావంగా చెన్నైలో కూడా దీక్ష చేపట్టాలని ఆయన మద్దతుదారులు నిర్ణయించారు.
ముంబైలోని ఎమ్ఎమ్ఆర్డీఎలో దీక్ష చేసేందుకు అన్నా హజారే రోజుకి రూ.8 లక్షలు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. చెన్నైలాంటి నగరంలో చేయాలంటే మాటలు కాదు కదా.. అందుకే తమ దీక్షకు కాస్తంత సాయం చేయాలని అన్నా మద్దతుదారులు సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను అడిగారట.
రజినీకాంత్ ఏకంగా చెన్నైలోని తన రాఘవేంద్ర కల్యాణమండపాన్ని మూడు రోజులపాటు ఎటువంటి అద్దె లేకుండా ఉచితంగా ఇస్తాననీ, దీక్ష చేసుకోమని చెప్పాడట. అంతేకాదు.. అవినీతి అంతానికి తనవంతు పాత్ర పోషిస్తానని, అవినీతికి తాను వ్యతిరేకమని చెప్పుకొచ్చారట రజినీకాంత్.