1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Anr

Akkineni Annapurna | Anr | అక్కినేని నాగేశ్వర రావు సతీమణి అన్నపూర్ణ కన్నుమూత

అక్కినేని అన్నపూర్ణ
ా|| అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అక్కినేని అన్నపూర్ణ బుధవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. ఆమెకు 79 సంవత్సరాలు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మరణించారు.

తల్లి మరణవార్త తెలుసుకున్న అక్కినేని నాగార్జున బెంగళూరు నుంచి హుటాహుటిన నివాసానికి చేరుకున్నారు. అన్నపూర్ణకు ముగ్గురు కుమార్తెలు, వెంకట్‌, నాగార్జున ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లో సినీపరిశ్రమ తరలివచ్చినప్పుడు కట్టిన స్టూడియోలో అన్నపూర్ణ పేరుతో నెలకొంది. ఆమె ఎన్నో చిత్రాలకు సమర్పకురాలుగా వ్యవహరించారు.

1949 ఫిబ్రవరి 18న అక్కినేనితో అన్నపూర్ణకి వివాహం జరిగింది. అక్కినేని దంపతులు 2009లో వజ్రోత్సవవేడుకలు కూడా జరుపుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు తదితరులు తమ సంతాప సందేశాలను తెలియజేశారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT