Chiranjeevi | ram Charan tej | Telugu Film Industry | Career | నా సినీ ప్రస్థానాన్ని రామ చరణ్ కొనసాగిస్తాడు : చిరు
Published: Fri, 30 Dec 2011 (11:57 IST)
తన వెండితెర ప్రస్థానాన్ని తనయుడు రామ్ చరణ్ తేజ్ కొనసాగిస్తాడని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తన 150వ చిత్రంలో నటించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో నటించేందుకు తాను పచ్చజెండా ఊపితే ఆ చిత్రాన్ని తీసేందుకు పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. వీరిలో రామ్ చరణ్ కూడా ఒకరని చెప్పారు. గురువారం రాత్రి నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తన బలం, బలహీనత రెండూ అభిమానులేనన్నారు. తాను పదవుల కోసం ఏనాడు వెంపర్లాడలేదన్నారు. వాటికోసం నేల విడిచి సాము చేయబోనని చెప్పారు. ఏ పదవి ఇచ్చినా స్వీకరించి పార్టీ పటిష్టత కోసం పని చేస్తానని చెప్పారు.
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
మరింత చదవండి