1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Hansika

Vishnuvardhan | Hansika | విష్ణువర్థన్ - హన్సిక జంటగా మంచు కొత్త చిత్రం

విష్ణువర్థన్
మంచు విష్ణువర్థన్ బాబు, హన్సిక జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓ వినోదభరితమైన చిత్రాన్ని నిర్మించబోతోంది. కొత్త సంవత్సరంలో జనవరి 5న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించుకుని, రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని చిత్ర సమర్పకులు డాక్టర్ మోహన్ బాబు తెలిపారు.

ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ... విష్ణుబాబు కెరీర్ లో మరో అత్యద్భుతమైన హిట్ సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. ఆద్యంతం ఈ సినిమా వినోదభరితంగా ఉంటుంది. చక్రి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఆరు పాటల్లో నాలుగు ఇప్పటికే రికార్డు చేయడం జరిగింది" అన్నారు.

2012లో ఈ సినిమా తమ బ్యానర్లో మంచి విజయాన్ని నమోదు చేస్తుందని ఆశిస్తున్నట్లు మోహన్ బాబు అన్నారు. అదేవిధంగా లక్ష్మీప్రసన్న నిర్మాతగా రూపొందుతున్న ఊ కొడతారా ఉలిక్కిపడతారా కూడా మనోజ్ కెరీర్లో నెంబర్‌వన్ సినిమా అవుతుందని ఆయన పేర్కొన్నారు. మనోజ్ బయటి బ్యానర్లో నటిస్తున్న మిస్టర్ నోకియా కూడా మనోజ్‌కు కొత్త సంవత్సరంలో ఘనవిజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నట్లు మోహన్ బాబు అన్నారు.

సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, బీవీఎస్ రవి, కోన వెంకట్, గోపీ మోహన్ తదితరులు తెరవెనుక పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీకృష్ణ, నిర్మాత: విష్ణువర్థన్ బాబు, దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT